సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్య నేతలు సోనియా, రాహుల్ తదితరులు ‘న్యాయ్పత్ర’ పేరుతో దిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు.ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై దీనిని రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం వివరించారు. గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, అన్నిరంగాల్లో విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ ”మా మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నాం. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో అందిస్తామన్న ఐదు న్యాయాలు, 25 గ్యారంటీలు దీనిలో ఉన్నాయన్నారు. ‘యువ న్యాయ్’ ‘మహిళా న్యాయ్’ ‘కిసాన్ న్యాయ్’ ‘శ్రామిక్ న్యాయ్’ ‘హిస్సేదార్ న్యాయ్”రక్షా న్యాయ్’ ఈ హామీలను ఇచ్చామన్నారు.
Discussion about this post