ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ప్రజా పరిపాలన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైందని, తొలిరోజు మంచి స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన కొన్ని సందేహాలను నివృత్తి చేశారు. జిల్లాలోని 86 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ వార్డుల్లో 104 గ్రామసభలు నిర్వహించినట్లు వెల్లడించారు. మొత్తం 25,351 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుకు సంబంధించిన రశీదును జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు.
Discussion about this post