మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంధర్ రెడ్డి, ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఆలయ చైర్మెన్ అలహరి మధుసూదన్ శర్మ, జిల్లా కలెక్టర్ రవి గుగులోత్ తో కలిసి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథం లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Discussion about this post