దశాబ్దాల తరబడి ఒకరికొకరు తోడుగా వైవాహిక బంధాన్ని కొనసాగిస్తూ… పిల్లలు, మునిమనువళ్ళ , మనువరాళ్ల సాక్షిగా…విశేష అలంకరణల నడుమ మేళతాలాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో అట్టహాసంగా వృద్ధుల వివాహ వేడుకను నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండాలో చోటుచేసుకుంది.
గుగులోతు సామిడా నాయక్, లాలి అనే వృద్ధులు 60 ఏళ్ళు క్రితం ఒకరికొకరు ఇష్టపడి వైవాహిక బంధాన్ని కొనసాగించి నలుగురు కుమారులు ఒక కూతురుకు జన్మనిచ్చారు. కుమారులు కూతుర్లకు వివాహాలు చేశారు.. వారికి పిల్లలు జన్మించారు. ఈ వృద్ధులు వివాహం చేసుకోలేదనే లోటు మా జీవితాల్లో ఉండకూడదని తమ పిల్లలకు తెలియచేయడంతో కొడుకులు, కూతుళ్లు ముని మనవళ్ళు, మనుమరాళ్లు , బంధుమిత్రులు, తండా వాసుల సమక్షంలో వృద్ధులకు హిందూ సంప్రదాయంగా వివాహం జరిపించారు. ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని పెళ్లి వేడుకలో ఒకరికొకరు మైమరిచిపోయారు. వివాహతంతు అనంతరం డిజే పాటలకు బంధువులు ఊర మాస్ స్టెప్పులతో అధరగొట్టి ఆహుతులను అలరించారు. బంధువులకు తండా వాసులకు పసందైన వంటకాలతో రుచికరమైన విందు భోజనం వడ్డించారు.
Discussion about this post