సైమా ఎక్స్పోలో లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్… బ్యూటీ ప్రొడక్ట్స్ ను ప్రదర్శించారు. ఇందులో సందర్శకుల కోసం మేకప్ కు సంబంధించిన వివిధ ఉత్పత్తులను ప్రదర్శించారు. మేకప్ ఆర్టిస్టులు అధునాతన అలంకరణ సామగ్రితో మోడల్స్ ను వివిధ రాష్ట్రాల పెళ్ళికూతుర్లు గా అలంకరించారు. మణిపూర్,అస్సామీ ,లంబాడీ,గుజరాతీ, తెలంగాణా పెళ్లికూతుర్లు ఎలా ఉంటారో కళ్ళకు కట్టినట్టు చూపారు. ఈ ఎక్స్పో లోనే మెహందీ పోటీల్లో నైపుణ్యం ప్రదర్శించిన నిపుణులకు .. అలాగే ఉత్తమ బ్రైడల్ మేకప్ ఆర్టిస్టులకు … బెంగళూరుకి చెందిన సెలబ్రిటీ యాంకర్ అమన్ వర్మ మెమంటోలను,సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న యువతులు, వారికి మేకప్ చేసిన ఆర్టిస్టులు ఫోర్ సైడ్స్ టీవీ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తంచేశారు.
























Discussion about this post