నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో 50 మంది ముస్లిం సోదరులు టీడీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేశ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వింజమూరు వైసీపీ కో ఆప్షన్ ఎంపీటీసీ రఫి, మరి కొన్ని కుటుంబాలు సైకిల్ ఎక్కారు. చాలా మంది నాయకులు వైసీపీలో ఇమడలేక టీడీపీలో చేరుతున్నారన్నారు. ప్రజలు టీడీపీకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ గెలుపు ఖాయమని కాకర్ల సురేశ్ తెలిపారు. వచ్చే రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ కన్వీనర్ రఘునాథరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post