మహబూబ్ నగర్ : అయోధ్య బలరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం గోపాలపురం రామాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా విగ్రహారాధన కార్యక్రమాన్ని భక్తులు వీక్షించారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
జై శ్రీరామ్ నామస్మరణతో దేవాలయాలు మారుమోగాయి. అనంతరం శ్రీరాములవారి గుడి నుండి బైక్ ర్యాలీ ప్రారంభించారు. సింగొరం జటప్రోల్ గోపాలపురం బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శ్రీరాముని విగ్రహాలు ఊరేగించారు. మహిళా మణులు మంగళహారతితో స్వాగతం పలికారు.
Discussion about this post