మహబూబ్ నగర్ క్రీడా మైదానంలో ఈత కొలనును స్థానిక ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈతతో పిల్లల్లో హైట్ పెరగడంతోపాటు శారీరక దారుఢ్యం కలుగుతుందన్నారు. ఎక్కువ మంది ఈత కొట్టడంతో నీరు కలుషితమై అలర్జీ, చర్మ వ్యాధులు రాకుండా ఈత కొలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను కోరారు.
ప్రధానంగా మహిళలు, బాలికలు ఈత కొలనులో ఉన్నప్పుడు విధిగా మహిళా నిపుణులు ఉండాలన్నారు. అత్యవసరమైన ప్రథమ చికిత్స అందించే ఏర్పాటు చేసుకోవాలని.. ఈత లో నైపుణ్యం కలిగిన నిపుణులను అందుబాటులో ఉంచుకోవాలని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Discussion about this post