మేడారం మహా జాతర : మేడారం మహా జాతరలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు కనీసం పాపం కూడా లేకుండా పోయింది. నాసిరకం పనులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద క్యూలైన్లకు రంగులు వేయడంలో భారీ అవినీతి జరిగినట్లు వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. క్యూ లైన్లలోని ఇనుప బారికేడ్లకు రంగులు వేసేందుకు రూ.25 లక్షలకు కాంట్రాక్ట్ తీసుకున్నారు. కానీ బారికేడ్లకు నామమాత్రంగా రంగులు వేసి చేతులు దులుపుకుంటున్నారు.
Discussion about this post