సమ్మక్క సారలమ్మ జాతర : ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షన్నర మందికి పైగా భక్తులు వస్తారని భావిస్తున్న ప్రభుత్వం అక్కడ మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతుల వంటి మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు మంజూరు చేసినా పనులు మాత్రం అరకొరగానే జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే వస్తున్న భక్తులు రోడ్లపక్కన, పొలాల్లో గడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను, అక్కడి పరిస్థితులను ఫోర్ సైడ్ టీవీ ప్రతినిధి బృందం పరిశీలించింది.
Discussion about this post