మేడారం సమ్మక్క సారలమ్మ జాతర : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా మూడు వారాలు సమయం ఉండగానే ఇప్పటికే భక్తులు పోటెత్తారు.. వనదేవతలను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతున్నారు. భక్తులు ముందుగా జంపన్న నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సమ్మక్క సారలమ్మను దర్శించుకోనున్నారు. అమ్మవారికి ఇష్టమైన పసుపు, కుంకుమ, బెల్లం సమర్పించి తమ కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. అయితే జాతరకు వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. గతంలో పరిస్థితి ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది.. ఎలాంటి సమస్యలు ఉన్నాయి.. ఎలాంటి ఏర్పాట్లు చేయాలి.. అనే అంశాలపై ఫోర్ సైడ్ టీవీ భక్తులతో మాట్లాడింది.. ఆ విశేషాలు మీకోసం.
Discussion about this post