తెలంగాణలో ఆదివాసీల దైవం మేడారం సమ్మక్క సారలమ్మల జాతర కొనసాగుతుంది. ఈ జాతరకు ఇప్పటికే లక్షలాదిగా భక్తజనం పోటెత్తారు. జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ అన్ని జిల్లాల నుంచి అదనపు బస్సులను ఏర్పాటు చేసి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుంది.
మేడారం మహా జాతరకు tsrtc నుండి 6000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఎండి వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే మేడారం జాతరకు బస్సులు వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో 51 క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి బస్సులు నడుపుతున్నట్టు సజ్జనార్ తెలిపారు. పెద్ద మొత్తంలో బస్సులను మేడారం జాతరకు తరలించిన నేపథ్యంలో, రెగ్యులర్ సర్వీసులను తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సమయంలో సాధారణ ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.
Discussion about this post