కరీంనగర్ జిల్లాలో సర్కారు ఆసుపత్రిలో పోస్ట్మార్టం చేసేందుకు వైద్య సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గొర్రెల కాపరి బొందయ్య బావిలో పడి మృతిచెందాడు. పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబం నుంచి 6000 లంచం అడిగారని సీపీఐ నాయకులు గడిపె మల్లేశ్ ఆరోపించారు. మంత్రి పోన్నం ప్రభాకర్ మందలించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి తీరు మారలేదన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Discussion about this post