సానుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ యత్నం
జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఓటు వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. తాజాగా ఏపీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్స్, కామెంట్స్ పెడుతుండటంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 168లో కొణిదెల నాగబాబు, కొణిదల పద్మజ, సాయి వరుణ్ తేజ్ ఓటు వేశారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తాజాగా ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారంటూ కొన్ని ఆధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మండిపడుతున్నారు.
మరోవైపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు. ‘కొణిదెల నాగేంద్ర రావు అలియాస్ కొణిదెల నాగబాబు చేసిన ఘనకార్యం.. ఏం ప్యాకేజ్, మ్యారేజ్ స్టార్? నీతులు పక్క వాళ్లకు చెప్పడమేనా? తమరు పాటించడం లేదా?’ అంటూ ఘాటుగా స్పందించారు. ఈ వివాదంపై నాగబాబు, జనసేన స్పందించాల్సి ఉంది.
Discussion about this post