బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో జారీచేసిన 5089 డీఎస్సీ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి 11,062 పోస్టుల భర్తీతో కొత్త నోటిఫికేషన్ ను నేడు జారీ చేయనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో 8792 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో అప్లై చేసుకున్నవారు మరో మారు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తెలిపారు.
వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. కొత్త నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు.
Discussion about this post