దేశంలో మొట్టమొదటిసారి మెట్రో రైల్ తిరిగింది ఎక్కడ అంటే చాలామంది డిల్లీ అంటారు ,, అయితే డిల్లీ మెట్రో స్టార్ట్ అయ్యింది మాత్రం 2002లో మాత్రమే. కానీ అంతకు దాదాపు ఇరవైసంవత్సారాల ముందే దేశంలో ఫస్ట్ మెట్రో రైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అంటే 1984లో కొలకత్తాలో ఈ మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభించారు.. ఇప్పుడు ప్రతి రాష్ట్రం కూడా మెట్రో రైల్ రావాలని కోరుకుంటోందంటే కారణం కొలకత్తా మెట్రో అనే చెప్పచ్చు. ఈ విషయం ఇప్పుడు మాట్లడటానికి కారణం కూడా వుంది.. మెట్రో సర్వీసులను ఫస్ట్ ప్రారంభించిన కొలకత్తా. ఇప్పుడు దేశంలోనే అండర్ వాటర్ మెట్రో ట్రైన్ జర్నీని ప్రారంభించనుంది. అండర్ వాటర్ టన్నెల్ ద్వారా ఈ మెట్రో ప్రయాణించనుంది.
గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణించే అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీసులను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దేశంలో అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు ఇది ఒక ఉదాహరణే ఈ అండర్ వాటర్ మెట్రో అని అధికారులు చెపుతున్నారు.
కోల్కతాలో ప్రారంభం కానున్న ఈ అండర్ వాటర్ మెట్రో సర్వీస్ ఈస్ట్-వెస్ట్ మెట్రో కిందకు వస్తుంది. దీనికోసం తవ్విన సొరంగాల నిర్మాణం ఏప్రిల్ 2017 ప్రారంభించారు. 30మీటర్ల లోతులో 520 మీటర్ల వరకూ రెండు సొరంగాలను నిర్మించారు.
వివిధ దేశాల నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. మరోవైపు నీరు లీకేజీ కాకుండా నాలుగు రక్షణ కవర్లు కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ అండర్ వాటర్ మెట్రో అనుభవం కోల్ కతా ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
Discussion about this post