అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపి అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపి కౌన్సిలర్ పద్మజ టీడీపి తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతోపాటు 50 కుటుంబాలు టీడీపిలో చేరాయి. రాయదుర్గం టీడీపి అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు వారందరికీ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వైసీపి కౌన్సిలర్ టీడీపిలో చేరడం ఒక శుభ పరిణామం అన్నారు. మెగా డీఎస్సీని… దగా డీఎస్సీగా మార్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు.
Discussion about this post