వివిధ భాషల్లో సినిమాలు, ఓటీటీలు, వెబ్‌సిరీస్‌లు, ఐటెంసాంగ్‌లు చేస్తూ మిల్కీబ్యూటీ తమన్నా దూసుకెళ్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘జైలర్’లోని ‘కావాలయ్యా…’ సాంగ్ ఇప్పటికీ మార్మోగిపోతోంది.ఈ సాంగ్ యూట్యూబ్ షార్ట్స్ లో హల్చల్ చేస్తోంది.
కుర్రకారును ఆకట్టుకుంటున్న తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించడంపై స్పందించారు .. “నేను కలిసి పని చేసిన గొప్ప నటుల్లో రజనీకాంత్ ముందుంటారు.అంత పెద్ద స్టార్ అయ్యి ఉండీ ఎంతో ఒదిగి ఉంటారు. ఆ స్థాయికి చేరిన వ్యక్తి అణకువగా, నిరాడంబరంగా ఉండటం చూస్తే ముచ్చటేస్తుంది. ఆయనతో పని చేయడం నా అదృష్టం’ అని చెప్పుకొచ్చింది.
అలాగే ఫ్యాషన్ల గురించి మాట్లాడుతూ.. ‘కార్గో ప్యాంట్లు వేయడమంటే నాకు ఇష్టం. విమాన ప్రయాణాల్లో నేను ఎక్కువగా వీటితోనే కనిపిస్తుంటాను. అవి నాకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి’ అంటూ తన ఫ్యాషన్ సీక్రెట్ ఏమిటో చెప్పేసింది.
ప్రస్తుతం తమన్నా తొలిసారి ‘బాంద్రా’ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. ఇందులో దిలీప్ హీరో గా చేస్తున్నారు. నవంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది. ‘అరణ్మయ్4’ అనే తమిళ హారర్ కామెడీ మూవీలో కూడా తమన్నా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
Discussion about this post