ఈ నెల 6న కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభను విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. లీగల్ నోటీసులు ఇచ్చినా ఎదుర్కొంటామని.. అందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణలో తేలితే తప్పని సరిగా శిక్షకు అర్హులేనని చెప్పారు. కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని సురేఖ మండిపడ్డారు. కేటీఆర్ భాష మార్చుకుంటే మంచిదని.. సీఎం పైనా కేటీఆర్ వాడే భాష సబబేనా అని ప్రశ్నించారు.
Discussion about this post