రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రైస్తవులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌కు పంపినప్పుడు తెలంగాణ కోసం పోరాడిన బిడ్డగా ప్రజల్లో గౌరవం పెంచారన్నారు. ఇప్పుడు మంత్రిగా హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. క్రైస్తవుల సమస్యలను పరిష్కరిస్తామని పొన్నం తెలిపారు.
Discussion about this post