పిలవగానే వచ్చారని విద్యార్థుల ఖుషీ
తెలంగాణ మంత్రి సీతక్క మేడారంకు వెళ్తుండగా, మార్గమధ్యంలో విహార యాత్రకు వచ్చిన పాఠశాల విద్యార్థులు సీతక్కను గమనించారు. వెంటనే సీతక్క.. సీతక్క… అంటూ కేకలు వేశారు. దీంతో మంత్రి సీతక్క వాహనం దిగి విద్యార్థుల బస్సు లోకి వెళ్లారు. బస్సులోకి వెళ్ళగానే జై బోలో సీతక్క అంటూ విద్యార్థులు కేకలు వేశారు. ఎక్కడ నుంచి వచ్చారని అడగగానే హైదరాబాద్ లోని మణికొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులమని చెప్పారు.అందుకు బదులిస్తూ నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని సీతక్క చెప్పారు. విద్యార్థులను ఆమె ఆప్యాయంగా పలకరించారు. సీతక్క అభిమానులమని, కొందరు… సమ్మక్క… సారక్క… సీతక్క.. అంటూ మరొకరు కేకలు వేయడంతో సీతక్క ఆనందపడ్డారు. ఆ తర్వాత సీతక్క మేడారం వెళ్లి అమ్మ వార్లను దర్శించుకున్నారు.
Discussion about this post