ములుగు జిల్లా కేంద్రంలోని సఫాయి కాలనీలో గృహ జ్యోతి కార్యక్రమం క్రింద లబ్ధిదారులకు జీరో బిల్లులను మంత్రి సీతక్క అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని, మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని సీతక్క అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో రెండు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలును ప్రారంభించామన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం ద్వారా వేల మందికి లబ్ధి చేకూరిందని అన్నారు. గత ప్రభుత్వాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని, దానిని సరిచేస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.






















Discussion about this post