భద్రాద్రి కొత్తగూడెం జిల్లా …భద్రాచలంలో నిర్మాణంలో వున్న నూతన బ్రిడ్జి పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. 2015లో 100 కోట్ల వ్యయంతో ప్రారంభించిన బ్రిడ్జి ఎనిమిదేళ్లయిన పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్ పై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెల ఆఖరుకు బ్రిడ్జి పనులన్నీ పూర్తి చేసి వాహనాలు తిరిగేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. డివైడర్లు, రహదారి, బ్రిడ్జి ప్రాంతాలన్నీ సుందరంగా తీర్చిదిద్ది బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. గతంలో తానే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశానని, మళ్లీ తానే బ్రిడ్జి ప్రారంభం చేయబోతున్నానని అన్నారు. రెండు మూడు సీజన్లలో పూర్తి కావాల్సిన బ్రిడ్జి ఎనిమిదేళ్లయిన ఎందుకు పూర్తి కాలేదో వివరణ ఇవ్వాలని అడిగారు.జిల్లా కలెక్టర్ ప్రియాంక అల దగ్గరుండి పనులు పరిశీలించాలని కోరారు. అనంతరం భద్రాచలంలోని రామాలయం రోడ్డులో గల శ్రీ సీతారామ కమ్మ సేవా సమితి నూతన వసతి గృహ న్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. అనంతరం కమ్మ సేవా సమితి నూతన భవనంలో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు..
Discussion about this post