మంత్రి వెంకట్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి కుల,మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ధిపొందాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటారని, రాబోయే ఎన్నికలు దేశ ఐక్యతకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ లో గ్రూపులు లేవు. ఏకనాథ్ షిండేలు లేరు అన్నారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకోవాలని, మాపార్టీ అంతర్గత విషయాలు మహేశ్వరరెడ్డి మాట్లాడకూడదన్నారు. బండి సంజయ్ ను ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అని ఆయన ప్రశ్నించారు.
Discussion about this post