దాదాపు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ప్రదర్శనలకు భారత్ వేదిక కానుంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో దీనికి సంబంధించిన కార్యక్రమాలు జరగనున్నాయి. మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే గ్రాండ్ సెర్మనీతో ఇది ముగుస్తుంది. ఇండియన్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
వివిధ దేశాల నుంచి వచ్చిన 120 మంది అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొంటారు. అర్చన కొచ్చర్ ఈ పోటీలకు అధికారిక ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు. ఫెమిన మిస్ ఇండియా వరల్డ్ 2022 విజేత సిని షెట్టి భారత్ తరుపున పాల్గొననున్నారు. ఈ పోటీలతో ప్రపంచ అందగత్తెను మనదేశంలో గుర్తిస్తారన్నమాట. రసవత్తరంగా జరిగే ఈ పోటీల్లో అందగత్తెల వాక్చాతుర్యం, ఆలోచనావిధానం, తెలివితేటలను కూడా జడ్జీలు పరీక్షిస్తారు. ఫిబ్రవరి 23న న్యూఢిల్లీ భారత్ మండపంలోని సమిత్ హాలులో ఈ పోటీ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 25 న మిస్ వరల్డ్ స్పోర్ట్స్ టైటిల్ కోసం పోటీలు ఉంటాయి.
1978లో మొదటిసారిగా పాటలు, నృత్యం, కవితల పోటీతో మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో నిర్వహించారు. మార్చి 3న ముంబైలో ఈ పోటీలు కూడా జరుగుతాయి. మోడలింగ్ కాంపిటీషన్ లో విజేతకు ‘మిస్ వరల్డ్ టాప్ మోడల్’ గా గుర్తిస్తారు. ఆమెతోపాటు ఆమెకు దుస్తులు అందించిన డిజైనర్ కూడా ప్రపంచ ‘టాప్ డిజైనర్’ గా గుర్తిస్తారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో అత్యంత అందమైన దుస్తులతో ఆయా దేశాల అందమైన యువతులు ప్రేక్షకుల మనస్సును దోచుకోనున్నారు.
Discussion about this post