లోక్సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి అయితే దేశం మరోసారి సార్వత్రిక ఎన్నికలను చూడబోదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు.
భారత్లో ఉన్న ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చివేసి..నిరంకుశత్వాన్ని తీసుకువస్తారని ప్రధాని మోదీపై ధ్వజమేత్తారు.ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశం నిరంకుశ రాజ్యంగా మారకుండా అడ్డుకోవటమే తమ పార్టీ ప్రధానాంశమని తెలిపారు. నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలో వస్తే.. బీజేపీకి కూడా ఎంటువంటి లబ్ధి జరగదన్నారు. నెమ్మదిగా బీజేపీ పార్టీ తన ఉనికి కోల్పోతుందన్నారు. కేవలం నరేంద్ర మోదీ మాత్రమే మిగులుతారని అన్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తున్న ఎన్నికల ప్రచారంపై అడిగి ప్రశ్నకు స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ ప్రభావం తగ్గుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి ఈసారి ఎన్నికల్లో కూడా ఓట్లు వేయరని స్పష్టం చేశారు.
Discussion about this post