పవన్‌ కళ్యాణ్ పై MLA అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

MLA Anirudh Reddy Comments on Pawan Kalyan

పవన్ కల్యాణ్‌ను ఓ ‘ప్యాకేజ్ స్టార్’ అని అభివర్ణిస్తూ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ అధినేత జగన్ ఎక్కువ ప్యాకేజీ ఆఫర్ చేస్తే.. పవన్ అటువైపు వెళ్లడానికి కూడా వెనుకాడరని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి.

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మేధావి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌పై ఇటీవల జనసేన శ్రేణులు, పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను అనిరుధ్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను విమర్శించే స్థాయి గానీ, కనీస అర్హత గానీ పవన్ కల్యాణ్‌కు లేవని ఆయన మండిపడ్డారు. “దమ్ముంటే పవన్ కల్యాణ్ తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయాలంటూ అనిరుధ్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ బిడ్డల జోలికి ఏపీ నాయకులు వస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

  • పవన్‎కల్యాణ్‎పై జడ్చర్ల MLA అనిరుధ్‎రెడ్డి హాట్ కామెంట్స్
  • ప్రొ. నాగేశ్వర్‎ను విమర్శించే స్థాయి పవన్‎కు లేదు
  • నాగేశ్వర్‎ను అరెస్ట్ చేయాల్సి వస్తే ఆయన ఇంటి ముందు..
  • నిలబడి నేనే ముందు అరెస్ట్ అవుతా -అనిరుధ్
  • పవన్ ప్యాకేజీ స్టార్, ప్యాకేజీ కోసం రేపు..
  • జగన్‎తోనైనా పొత్తు పెట్టుకుంటారేమో -అనిరుధ్‎రెడ్డి

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top