తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని జిబిఆర్ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే పడాల అమ్మిరెడ్డి 38వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కళాశాల వ్యవస్థాపకులు గొలుగూరి బాపిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ.. మహిళా విద్యను కాంక్షిస్తూ బాపిరాజు ప్రజా సహకారంతో కళాశాల నిర్మించారన్నారు. ప్రస్తుతం కళాశాల జవాబుదారీ తనం లేకుండా కార్పొరేట్ సంస్థల వ్యవహరిస్తుందని అన్నారు. ఆయన చేసిన సేవలు ఎనలేనివని.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రామకృష్ణారెడ్డి తెలిపారు.
Discussion about this post