రాష్ట్రంలోని మహిళలను చులకనగా, అసభ్యకరంగా చూస్తూ వారి చావుకు కారణం అవుతున్న టీడీపీ, జనసేనలను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుమలలో ఏపీ టూరిజంకు సంబంధించిన అన్నమయ్య, బాలాజీ, నారాయణగిరి రెస్టారెంట్లను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ… తిరుమల కొచ్చే భక్తులకు మంచి క్వాలిటీ, క్వాంటిటీ అందించే లక్ష్యంతో మూడు కొత్త రెస్టారెంట్లను అందుబాటులోకి తేవడం గర్వకారణంగా ఉందన్నారు. టీటీడీ నిర్ణయించిన ధరల ప్రకారం స్టార్ హోటల్ తరహాలో నాణ్యమైన భోజనాన్ని భక్తులు అందించేలా జరుగుతుందన్నారు. ప్రతి మహిళ బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి చనిపోవడం చాలా బాధ వేసిందన్నారు. కేవలం తన కొచ్చిన ఇంటి పట్టాను సంతోషంగా మీడియాకు చూపించి, మాట్లాడడమే ఆమె చేసిన తప్ప అని అన్నారు. టీడీపీ, జనసేన రెండు ఆ మహిళపై అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంతో వేధించారని చెప్పారు. మహిళలను గౌరవించే ఈ పుణ్య దేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం అన్నారు. ఎవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడి ఆ మహిళ చావుకు కారణమయ్యారో, వాళ్లందరికీ తగ్గిన శిక్ష పడేలా భగవంతున్నిప్రార్ధించినట్లు చెప్పారు.
Discussion about this post