ధర్మానికి ప్రతి రూపం శ్రీరాముడు
శ్రీరాముడు చూపిన మార్గంలో మనందరం కలిసి నడవాలని బీజేపీ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా ఏనాడూ ఆయన ధర్మాన్ని విస్మరించలేదన్నారు. దేశ ఖ్యాతి ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప ఘట్టం శ్రీ రామ మందిర నిర్మాణమన్నారు. మహబూబ్ నగర్ లోని తూర్పు ద్వారం వద్ద శ్రీరామ జన్మభూమి అక్షతల శోభయాత్రను ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు ప్రారంభించారు.
అయోధ్యలో శ్రీరామమందిరం 22న ప్రారంభోత్సవం కానుండగా, దానిని దీపావళిలా ఆచరిస్తామని శ్రీరామ భక్తులు చెబుతున్నారు. భక్తులంతా భజన మండలి, విశ్వహిందూ పరిషత్ సభ్యులతో కలిసి సీతారాముల రథం ముందు రామ నామ సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎన్ పి వెంకటేష్, మద్ది యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.























Discussion about this post