టెక్నాలజీ పెరిగే కొద్ది చాలా రకాల సౌకర్యాలు చాల సులువుగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి… మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు సర్వం మీ చేతిలో ఉన్నట్లేనని అనేక సార్లు రుజువైంది… తాజాగా ఓటింగ్ విషయంలో కూడా మొబైల్ ఉపయుక్తంగా మారింది. ప్రజలు ఓటు వేసే పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సెల్‌ఫోన్ యూజ్ అవుతుంది.
దేశంలో ఎన్నికల కోలాహలం నడుస్తోంది… ప్రజల దగ్గరకు వెళ్లి రాజకీయ పార్టీ నాయకులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.. ఎన్నికల కోసం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడంలో అధికారులు ముమ్మరం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓట్లు మిస్లీడ్ కాకుండా చర్యలు చేపట్టారు.. ఓటరు స్లిప్ ద్వారా మన ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో తెలుసుకుంటాం… లేదా రాజకీయ పార్టీల కార్యకర్తలు మన ఓటు ఎక్కడ ఉందో తెలుపుతారు.. ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ స్లిప్‌లు పంచి పోలింగ్ బూత్ వివరాలు చెబుతారు… అయితే ఇప్పుడు మీ ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉందో తెలుసుకోవడానికి మీ మొబైల్ ఉపయోగ పడుతోంది.
మన ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో మొబైల్ నంబర్ సాయంతో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న లోక్‌సభకు పోలింగ్ జరగనుండటం తెలిసిందే. ఏపీ అసెంబ్లీకి కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో లోక్‌సభకు ఎన్నికలున్నాయి. ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్ ఐడీ కార్డు సాయంతో సులువుగా తెలుసుకోవచ్చు. ఓటరు ఐడీలో ఇంగ్లీష్ అక్షరాలు, 10 అంకెలతో కూడిన ఎపిక్ ఐడీ పోలింగ్ బూత్‌ను గుర్తించడానికి కీలకమవుతుంది. ఏ కారణంతోనైనా కార్డు అందుబాటులో లేని వారు ఆన్లైన్లోనే ఎపిక్ నంబర్ గురించి తెలుసుకోవచ్చు.
ఎపిక్ నంబర్ కోసం ఈసీ పోర్టల్ ను సందర్శించాలి. అందులో కుడివైపు కనిపించే సర్వీసెస్ విభాగంలో ‘ఈ–ఎపిక్ డౌన్లోడ్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత వచ్చే పేజీలో సైనప్ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి, కంటిన్యూ చేయాలి. తర్వాత పేరు నమోదు చేసి, పాస్వర్డ్ ఎంపిక చేసుకోవాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంపిక చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పటికే ఖాతా ఉన్న వారు సైనప్ చేయనవసరం లేదు.
మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్ అవడం ద్వారా ఈ–ఎపిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఎపిక్ నంబర్ తెలిసిపోతుంది. తర్వాత సైట్ హోం పేజీలో కుడివైపున ఉన్న ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ ఎంపిక చేసుకోవాలి. వచ్చే ప్రత్యేక పేజీలో ఎపిక్ నంబర్ నమోదు చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకుని క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ బటన్ ఓకే చేయాలి. మీ పోలింగ్ బూత్‌తో పాటు పోలింగ్ స్టేషన్ ఆఫీసర్ తదితర వివరాలు కూడా లభిస్తాయి. ఇదే పోర్టల్ నుంచి ఫిర్యాదులు సైతం దాఖలు చేయవచ్చు. ఎపిక్ నంబర్ ఉన్న వారు నేరుగా సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆప్షన్‌కు వెళ్లవచ్చు.
Discussion about this post