తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ చర్చకు తెరదీశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ చర్చకు తెరదీశారు (Mock Assembly in NCERT) . ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలని కోరారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్సీఈఆర్టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్-18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాల్సిన అవసరముందని ఆ సందర్భంగా చెప్పుకొచ్చారాయన. ఇప్పుడు సీఎం చేసిన కామెంట్స్ వినేందుకు వింతగా అనిపించినప్పటికీ రాజకీయాల్లో మాత్రం సరికొత్త చర్చకు తెరదీశాయి. ప్రస్తుతం ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలంటే అభ్యర్థులకు 25 ఏళ్లు నిండాలనే నిబంధన ఉంది. దీన్ని 21 ఏళ్లకు తగ్గించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.
21 ఏళ్లు నిండిన వారు శాసనసభ్యులుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. Mock Assembly in NCERT
గతంలో ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 సంవత్సరాలుగా ఉండేది. దాన్ని 21 ఏళ్ల నుంచి 18ఏళ్లకు తగ్గించారు. అదే సమయంలో ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధనను మాత్రం సవరించలేదు. ఈ నిబంధనను కూడా సవరించుకుని… 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. తద్వారా యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుంది. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నప్పుడు… 21 ఏళ్లు నిండిన వారు శాసనసభ్యులుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. Mock Assembly in NCERT.
ఎన్సీఈఆర్టీలో మాక్ అసెంబ్లీ నిర్వహించిన విద్యార్థులు
ఇక విద్యార్థులు చేపట్టిన మాక్ అసెంబ్లీ తీర్మానాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇందులో పాల్గొన్నారు. విద్యార్థుల మాక్ అసెంబ్లీ చూసేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం కొత్త ప్రతిపాదన తెరపైకి తేవడంతో ఆ ప్రతిపాదన పట్ల రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. చాలా మంది సీఎం చేసిన ప్రతిపాదనకు సానుకూలంగానే స్పందిస్తున్నారు. 21 ఏళ్ల వయో పరిమితి చట్టసభలకు ఎన్నికయ్యే వారికి సరిపోతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. మరి ఇది నిజంగా కార్యరూపం దాలుస్తుందా చూడాలి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రతిపాదన
ఎమ్మెల్యే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలన్న సీఎం ,అండర్-18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్, ఎన్సీఈఆర్టీలో మాక్ అసెంబ్లీ నిర్వహించిన విద్యార్థులు, 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం ప్రతిపాదన, ఓటు హక్కు వయోపరిమితి 21 నుంచి 18ఏళ్లకు మార్పు, యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం, 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పని, రేవంత్ అభిప్రాయంపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ. Mock Assembly in NCERT .
మరిన్ని నవీకరణల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి : 4sides Tv.
Discussion about this post