శ్రీరామనవమి వేడుకల విషయమై ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బెంగాల్లో శ్రీరామ నవమి వేడుకలను మమత ప్రభుత్వం అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. దీనిని మమత తిప్పికొట్టారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. శ్రీరామ నవమి సందర్భంగా ర్యాలీ చేసుకోవడానికి వీహెచ్పీకి కోల్కతా హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, గత ఏడాది ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రదర్శన మార్గాన్ని మార్చాలని బెంగాల్ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో మోదీ, మమత మాటల యుద్ధానికి దిగారు. బలూర్ఘాట్లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘‘కోర్టు ర్యాలీ చేసుకోవచ్చని చెప్పింది కాబట్టి భక్తి శ్రద్ధలతో ప్రదర్శనను విజయవంతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. నవమి వేడులకు అనుమతివ్వని తృణమూల్ ప్రభుత్వం… ర్యాలీపై రాళ్లు వేసేవారికి మాత్రం అనుమతిస్తోందని మండిపడ్డారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post