భారత్ పేస్ దిగ్గజం మొహమ్మద్ షమీ ఎడమ చీలమండ గాయం కారణంగా వచ్చే నెలలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరం అవుతున్నాడు. శస్త్రచికిత్స చేయించుకోవడానికి యూకే వెళుతున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో పాల్గొనని 33 ఏళ్ల అతను చివరిగా నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
షమీ జనవరి చివరి వారంలో ప్రత్యేక చీలమండ ఇంజెక్షన్లు తీసుకోవడానికి లండన్‌లో ఉన్నాడు. మూడు వారాల తర్వాత, అతను తేలికగా పరుగెత్తడం ప్రారంభించాడు. కానీ ఇంజెక్షన్ పని చేయలేదు, ఇప్పుడు శస్త్రచికిత్స మాత్రమే మిగిలి ఉంది. అతను శస్త్రచికిత్స కోసం త్వరలో UKకి బయలుదేరతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాడు. షమీ 24 వికెట్లతో ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన సంగతి విదితమే. ఇటీవలే అర్జున అవార్డు అందుకున్న షమీ తన దశాబ్దపు కెరీర్లో 229 టెస్టులు, 195 వన్డేలు, 24 టీ20 వికెట్లు పడగొట్టాడు.
వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు వరుసగా 10 విజయాలు సాధించి సెమీస్ వరకూ దూసుకురావడం ఓ ఎత్తయితే సెమీస్ లో మొహమ్మద్ షమీ ఒంటిచేత్తో అందించిన విజయం మరో ఎత్తు. అయితే వరల్డ్ కప్ లో కాలి గాయంతో బాధపడుతూనే టీమిండియాను సెమీస్ చేర్చిన షమీ ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆప్ఘనిస్తాన్ తో టీ20, ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లకు సైతం దూరమైన షమీ ఇప్పుడు ఐపీఎల్ 2024కు కూడా దూరమవుతున్నాడు.
వన్డే వరల్డ్ కప్ లో ఎడమకాలి మడమకు గాయం కావడంతో చికిత్స తీసుకుంటున్న మొహమ్మద్ షమీ కోలుకోకపోవడంతో లండన్ కు పయనమయ్యాడు. అక్కడ శస్త్రచికిత్స చేయించుకోవాలని షమీ నిర్ణయించుకున్నాడు. దీంతో ఐపీఎల్ టోర్నీ ఆడటం సాధ్యం కాదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో షమీ ఐపీఎల్ టోర్నీకి దూరమవుతున్నట్లు అతని ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ తో పాటు బీసీసీఐ కూడా నిర్ధారించాయి.
వాస్తవానికి షమీ కాలి గాయానికి చికిత్స కోసం జనవరి చివర్లోనే లండన్ కు వెళ్లాడు. అక్కడ మూడు వారాలుగా ఇంజెక్షన్లు కూడా తీసుకుంటున్నాడు. అయినా ప్రభావం లేకపోవడంతో చివరిగా సర్జరీ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. దీంతో సర్జరీ పూర్తయ్యాక తగిన విశ్రాంతి కూడా అవసరం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీలో షమీ ఆడటం సాధ్యం కాదని తేలిపోయింది. ఐపీఎల్ తర్వాత జరిగే టీ20 వరల్డ్ కప్ కూ షమీ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ లో జరిగే బంగ్లాదేశ్, న్యూజీలాండ్ టెస్టు సిరీస్ ల నాటికి షమీ కోలుకునే అవకాశాలున్నాయి.
Discussion about this post