ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భూకంపం తీవ్రత 4.0 ( Delhi Eathquake )
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం ( Delhi Earthquake)వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సోమవారం రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతూనే ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
ఈక్రమంలోనే భారీ స్థాయిలో బూమ్ అనే శబ్దం వినిపించగా.. మరింత వణికిపోయారు. అయితే ఢిల్లీ భూకంప సమయంలో వచ్చిన ఈ బూమ్ శబ్దానికి ఓ పెద్ద కారణమే ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరి ఆ కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Boom Sound in Delhi Earthquake
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం రోజు వేకువజామున భూకంపం సంభవించింది.
విషయం గుర్తించిన ఢిల్లీ ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విపరీతంగా భయపడిపోతూనే చిన్న పిల్లలను ఎత్తుకుని, ముసలి వాళ్లను పట్టుకుని.. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ రోడ్లపై కూర్చున్నారు. ఓవైపు భూమి కంపిస్తుండగానే.. మరోవైపు భారీ స్థాయిలో బూమ్ అంటూ శబ్దాలు రాగా..
మరింతగా వణికిపోయారు జనాలు. ఏం చేయాలో పాలుపోక నరకం చూశారు. అయితే ఈ బూమ్ శబ్దం రావడం వెనుక అసలు కారణం అదేనంటూ శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
సోమవారం రోజు వేకువజామున 5.36 గంటలకు ఢిల్లీ భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతో భూమి కనిపించగా.. ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. భూకంప సమయంలో భారీ స్థాయిలో బూమ్ అంటూ శబ్దాలు వచ్చాయి. అవి కూడా వీడియోల్లో వినిపిస్తున్నాయి.
అయితే ఇలా చప్పుళ్లు రావడం వెనుక మరేదో పెద్ద కారణమే ఉందని అంతా భావించారు. అది నిజమేనని శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు.
తక్కువ లోతులో ఉండే భూకంప కేంద్రం ఏర్పడినప్పుడు ప్రకంపన సమయంలో ఈ బూమింగ్ శబ్దాలు వినిపిస్తుంటాయని అమెరికా జియోలాజికల్ సర్వే నిపుణులు చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో భూమిపై ప్రకంపనలు రావడంతోపాటు స్వల్ప కాలం వచ్చిన భూతరంగాలు గాల్లో కలిసి ధ్వని తరంగాలుగా మారతాయని వివరించారు. అధిక ఫ్రీక్వెన్సీ కంపనాల కారణంగా బూమ్ అనే శబ్దం వస్తుందని చెప్పారు. కొన్నిసార్లు కంపనాలు జరక్కపోయినా.. ఈ భారీ శబ్దాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
For More Updates. Visit our Website. Click Here.
Discussion about this post