ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లో, వాణిజ్య స్థలాల్లో ఎలాంటి రాజకీయ ప్రకటనల హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించ వద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం హైవేలు, మెయిన్ రోడ్ల ప్రక్కనున్న హార్డింగ్లను కూడా సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో వున్నందున కొత్తగా అనుమతులు ఇవ్వవద్దని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుపరిచాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బోర్డర్ చెక్ పోస్టుల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరచాలని చెప్పారు. సి విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
Discussion about this post