పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఈరోడ్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ గణేశమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీ టికెట్ దక్కపోవడంతో మూడు రోజుల ఎండీఎంకే పార్టీ ముఖ్య నేత, ఎంపీ గణేశమూర్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన ఎంపీని ఆసుపత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో గణేశమూర్తి మృతి చెందారు. ఎండీఎంకే పార్టీలో కీలక నేత అయిన గణేశమూర్తి.. 2019 పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోడ్ నుండి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. కానీ ఈ సారి ఎండీఎంకే పార్టీ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎంపీ.. మూడు రోజుల క్రితం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్‌తో ఇవాళ మృతి చెందారు.
Discussion about this post