ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకి మద్దతు తెలిపారు ఎమ్మార్పీఎస్ నాయకులు. నగరంలో విసృత్తంగా పర్యటించి వినోద్ తరుఫున ప్రచారం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బిజెపి ఎంపీ అభ్యర్థి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. నరేంద్ర మోడీ సైనికుడిలా తమకు అన్ని విధాలుగా అండగా ఉంటరాని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రక్షణే మోదీ ప్రధాన ధ్యేయమంటూ కొనియాడారు. దేశ అభివృద్ధే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోందంటున్నారు ఎమ్మార్పీఎస్ నాయకులు. దళిత వర్గాలు ఎదుర్కొంటున్న అంటరానితనం, సమస్యలకు మోడీయో పరిష్కారమని అంటున్నారు.
Discussion about this post