కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరారు. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా.. వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ అన్నారు.
గత కొంతకాలంగా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ ఏపీలో తీవ్రంగా నడిచింది. నిన్న రాత్రి కిర్లంపూడి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్న ఆయన, వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సుదీర్ఘకాలం తర్వాత ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకూ కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలకూ దూరంగా ఉన్నారు. అయితే.. సీఎం జగన్ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని భావించిన ముద్రగడ చివరకు వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలుపొందారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ లోక్సభ స్థానంలో గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ పని చేశారు.
Discussion about this post