జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సోదరులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునిల్ కుమార్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ క్లబ్ లు నడిపే వారితో తనను తిట్టిస్తున్నారని… చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో పవన్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కూటమి పొత్తులో భాగంగా తీసుకున్న 20 సీట్లు కూడా త్యాగం చేసి పార్టీ మూసేయడం మంచిదని సూచించారు. షూటింగ్ లకు వెళ్లిపోతే త్యాగశీలిగా మిగిలిపోతారు పవన్ అంటూ ముద్రగడ సలహాలు ఇచ్చారు.
Discussion about this post