ఆపదలో ఉన్న మనిషి ప్రాణాలను సీపీఆర్ చేయడం ద్వారా కాపాడవచ్చని ములుగు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ చెప్పారు. సీపీఆర్ చేసే విధానంపై ములుగు జిల్లా మేడారం ఆదివాసి భవన్ లో జిల్లా వైద్య అధికారి అలెం అప్పయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఆర్ పై ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని అన్నారు.
Discussion about this post