ఉమ్మడి నెల్లూరు జిల్లా కనుపూరులోని ముత్యాలమ్మ జాతర ముగింపు కార్యక్రమం… భక్త జనసందోహం నడుమ, సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా సాగింది. ఏటా ఉగాదికి ముందు వచ్చే మంగళవారం పోలేరమ్మ, అంకాలమ్మల సమేతంగా గ్రామదేవత ముత్యాలమ్మ ఆరాధన ఏళ్ల తరబడి కొనసాగుతోంది. పాడి పంటలకు కొదవులేకుండా, చీడ పీడల నుంచి విముక్తి కల్పిస్తూ అమ్మవారు పూజలను అందుకుంటున్నారు. భక్త మండలి ఆధ్వర్యంలో తిరునాళ్ల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా కొనసాగాయి. సుదూర ప్రాంతాల ప్రజలు అమ్మవారికి మొక్కుబడులు సమర్పించేందుకు రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారింది.
Discussion about this post