భరోసా, స్వేచ్ఛాయుత పాలన, సాధించుకున్న తెలంగాణ ప్రజల మనోభావాలకు తగినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, ప్రముఖుల ఇళ్లకు వెళ్ళి మంత్రి తుమ్మల వారిని ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఖమ్మం 13వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో మంత్రి పాల్గొన్నారు. ఖమ్మం నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అయిందని అందువల్ల ముగ్గురిని మంత్రివర్గంలో కి తీసుకున్నారన్నారు. ఆయనకు ఇష్టమైన వ్యవసాయ శాఖ అప్పగించారని హర్షం వ్యక్తం చేశారు. సీఎం ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి కి బాటలు వేసేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
Discussion about this post