నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం చేస్తూ ఆర్డీఓ నాగరాజుకు ఎంపీటీసీలు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏడుగురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి పెడుతూ ఏడుగురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు మద్దతు తెలపగా…వైస్ ఎంపీపీ భోజ్యనాయక్ ను తొలిగిస్తున్నట్లు ప్రకటించారు. వైస్ ఎంపీపీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్డీఓ నాగరాజు తెలిపారు.
Discussion about this post