కొనుగోలు దారుల సౌకర్యం, విక్రయదారుల సౌలభ్యం కోసం ఏర్పాటైన నకిరేకల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం ఉపయోగం లేకుండా పోయింది. ప్రజలందరికీ ఒకే చోట మాంసం,చేపలు, కూరగాయలు అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేసిన ఈ మార్కెట్ పనులు ఇప్పటి దాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రారంభ దశలోనే మార్కెట్ యార్డ్ పనులు శిథిలావస్థకు చేరాయి. రెండేళ్ల నుంచీ పనులు అతీగతీ లేకపోవడంతో చిరు వ్యాపారులు వీధిపాలయ్యారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ కు ఓ పెద్ద చరిత్రే ఉంది. ఈ మార్కెట్ స్ధలంలో దాదాపు 80 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భవనాలు, గ్రంథాలయం, ఇంజనీరింగ్ భవనం, విద్యుత్తు బిల్లు వసూలు కేంద్రంతో పాటు చిరు వ్యాపారస్తుల దుకాణా సముదాయ భవనాలు ఉండేవి. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యల ఈ భవనాలను కూల్చివేయించినట్లు స్థానిక వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు.
మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ ఓకే చోట లభించేలా గత ప్రభుత్వం సమీకృత మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మూసి రోడ్లో 6 కోట 30 లక్షల రూపాయలతో సమకృత మార్కెట్ నిర్మించాలని డిసైడ్ చేశారు. ఈ మార్కెట్లో మొత్తం మూడు బ్లాక్ లు నిర్మించాలి. ఈ మూడు బ్లాకుల్లో మొదటిసారి చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 48 షాపులు నిర్మించాల్సి ఉంది. అయితే మరోసారి అగ్రిమెంట్ చేసుకున్న అధికారులు, షాపుల సంఖ్యను 68కి పెంచారు. మొదటి విడతగా 2 కోట్ల రూపాయలు విడుదల చేశారు. రెండో విడతలో 4 కోట్ల 30 లక్షల రూపాయలు విడుదల చేశారు. 2021లో ప్రభుత్వంలో అగ్రిమెంట్ చేసుకున్న ఓ కాంట్రాక్టర్ పనులను మొదలుపెట్టి కేవలం రెండు బ్లాకులకు మాత్రమే స్లాబ్ లెవల్ వరకు నిర్మించి వదిలేశారు. తొలివిడత నిధులు ఇస్తారని భావించిన కాంట్రాక్టర్ ఈ నిర్మాణాలు చేపట్టారు. అయితే మంజూరైన నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆయన స్లాబ్ వేసి వదిలేశారు.
దీంతో నకిరేకల్ మున్సిపల్ చేస్తున్న ఎస్.కే.ఆర్. సంస్థకు మార్కెట్ నిర్మాణ పనులు అప్పగించినట్లు మున్సిపల్ ఈవో గౌతం చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
Discussion about this post