నందిగామ నియోజకవర్గం పరిధిలోని కంచికచర్ల గ్రామంలో సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయ ధ్వజస్తంభ పున: ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇక్కడి ఆలయంలోని స్వామి వారి ప్రతిమ భద్రాచలంలోని స్వామివారి ప్రతిమతో పోలి ఉంటుంది.
పశ్చిమ కృష్ణలో రాతితో నిర్మితమైన ఆలయం ఎక్కడా లేదు. మూడు సంవత్సరాల కాలంలోనే ఈ ఆలయాన్ని పునర్ నిర్మించారు. కొలిచిన వారికి కొంగుబంగారమై నిలుస్తారని…భక్తుల కోరికలు నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాతి కట్టడంతో ఈ ఆలయం నిర్మించడంతో చూపరులను సైతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. 200 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం భవిష్యత్తులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుందని ఆలయ పండితులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Discussion about this post