కార్యకర్తల కుటుంబాలకు టిడిపి అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసానిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆమె ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. తొలుత పోలవరం నియోజకవర్గం టి.నర్సాపురం మండలంలోని మక్కినవారిగూడెంలో టిడిపి కార్యకర్త అబ్బదాసరి కృష్ణ కుటుంబ సభ్యులను, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని తాడేపల్లి శేఖర్ కుటుంబాన్ని,పెంటపాడు మండలం పడమరవిప్పర్రులో టిడిపి కార్యకర్త కోడే అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో మండల కేంద్రమైన నిడమర్రులో టిడిపి కార్యకర్త గొర్రెల సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించి భరోసా నిచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని భువనేశ్వరి విమర్శించారు.
Discussion about this post