తెలుగు జాతి ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా 1982 మార్చి 29న స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారని చంద్రబాబు ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల బంగారు భవిష్యత్ కోసం అంకితభావం తో కృషి చేస్తుందని హామీ ఇస్తూ.. తెలుగు ప్రజలందరికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని.. ప్రజలకు సేవ చేయడమని దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు శ్లాఘించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో , దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ ఇది స్ఫూర్తిదాయకమైన రోజని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కంభం పాటి రామమోహన రావు అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని శిఖరాగ్రాన నిలబెట్టినరోజు..ప్రతి కార్యకర్తలో ఉత్తేజం నింపేరోజని గుర్తు చేస్తూ… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లి చంద్రబాబు నివాసంలో తెలుగుదేశంపార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నారా భువనేశ్వరి నివాళులర్పించారు. విజయవాడ మాజీ మేయర్ అనురాధ,నారా బ్రాహ్మణి ఆమెకు కేక్ తినిపించారు.
Discussion about this post