Visakhapatnam News : యువగళం ద్వారా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ రికార్డును టచ్ చేశారని టీడీపీ విశాఖ సౌత్ ఇంచార్జి గండి బాబ్జీ అన్నారు. శంఖారావం పేరుతో మిగిలిన నియోజకవర్గాల ప్రజలను కలుస్తానన్నారు. విశాఖలో పలు చోట్ల శంఖారావం నిర్వహించనున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. వైసీపీ పాలనలో విశాఖ సౌత్ పూర్తిగా కంపు కొడుతోందని, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు కూడబెట్టారని వారు అన్నారు.
Discussion about this post