డబ్బు పంపిణీ జరగకుంటే… ప్రజా క్షేత్రంలో పార్టీల బలాబలాలను చూస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నారని… నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాంతీయ విభేదాలతో అనివార్యమైన విభజనకు అప్పటి పార్టీలు వత్తాసు పలికి, బిల్లుకు అనుగుణంగా సంతకాలు చేశాయని అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రభావాన్ని ఆపాదించాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్దే తప్ప…పదేళ్లలో రాష్ట్రంలో అభివృద్దే జరగలేదని అన్నారు. ప్రజల నెత్తిన అప్పుల భారం మోపారని, బిల్లుల మోత మోగిస్తున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు.
Discussion about this post